పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో సంచలన అయింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు ఒక కవితలాగా అనిపించాయి. అతడి జ్ఞాపకాలు, ముక్కలైన నా హృదయం లాంటి పదాలు వాడుతూ ఈ కవిత సాగింది. అయితే ఆమె చెప్పిన ఆ కవితలో చాలా అర్థాలు వెతుక్కుంటున్నారు అభిమానులు.
రేణుదేశాయి అంటే నటిగా కంటే కూడా పవన్ కల్యాణ్ భార్యగా అందరికి తెలుసు. రేణుదేశాయ్ ని వివాహం చేసుకున్న పవన్ కొద్ది కాలానికి ఆమెతో విడాకులు తీసుకొని మూడో వివాహం చేసుకున్నాడు. అయితే ఆ సందర్భంగా పలు ఛానళ్లు, వెబ్ మీడియాలో ఇంటర్వ్యూలలో పవన్ తో తనకు మధ్య ఉన్న బంధాన్ని పలు మార్లు చెప్పింది. అయితే కొద్దికాలానికి ఆ తరువాత విడాకులు తీసుకున్న పవన్
మోడలింగ్‌లో ఉన్నపుడూ ఎవరూ ప్రపోజ్ చేయలేదు. పవన్ ను చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాను. అప్పుడే ఇద్దరం ఒకరినొకరం బాగా ఇష్టపడ్డామని రేణు దేశాయ్ తెలిపారు. ట్రెడిషనల్ ఫ్యామిలీ నుండి వచ్చాను. సహజీవనం అంటే తొలుత చాలా భయం వేసింది. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా నమ్మకం ఉండటం వల్లే ఆభయం పోయింది. అందువల్లే లివింగ్ టుగెదర్ సాధ్యమైంది అని అన్నారు.
డైవర్స్ తీసుకున్న వారు ఒకరిపై ఒకరు చాలా కోపంగా ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోక పోవడం లాంటి వి ఉంటాయి. కానీ మా మధ్య అలాంటివి ఏమీ లేదు. ఇద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటాం. కొన్ని కారణాల వల్ల విడాకులు జరిగాయి అని రేణు దేశాయ్ తెలిపారు. ఎందుకు డైవర్స్ తీసుకున్నాను అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఏదో ఒక రోజు ఆ విషయం నా ఆటోబయోగ్రపీలో చెబతాను. అప్పటి వరకు చెప్పను అని అన్నారు. విడాకుల కారణం ఇపుడు చెబితే అనవసరంగా తలనొప్పి మొదలవుతుంది. అందుకే ఇపుడు మూతికి టేపేసుకుని నోరు మూసుకుని మౌనంగా ఉండడమే మేలు అని చెప్పారు. ఆ తరువాత కొన్నిసార్లు పవన్ కల్యాణ్ గురించి చెప్పిన రేణు దేశాయ్ రీసెంట్ గా ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో సమాధి కాబడ్డ నా జ్ఞాపకాలను మళ్లీ వెలికి తీశాను. ఆయన మాటలు, కొన్ని పదాలు, అతడి పేరు చెక్కడడి ఉన్న ఒక కలం అందులో కనిపించాయి అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.
సమాధి కాబడ్డ ఆ జ్ఞాపకాలు అన్నీ కూడా ఇపుడు ఎంతో విషాదంగా కనిపిస్తున్నాయి అని రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు. రేణు దేశాయ్ ఎవరిని ఉద్దేశించి ఈ కవిత రాశారు? తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకున్నారా? లేక ఇంకెవరి గురించి అయినా గుర్తు చేసుకున్నారా? లేదా రచయితగా తన టాలెంటుకు పదును పెట్టుకోవడంలో భాగంగా ఆమె దీన్ని రాశారా? అనేది తెలియాల్సి ఉంది.