టెలికాం రంగంలో దిగ్గజాలను మట్టికరిపించిన రిలయన్స్ జియో గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే అవసరం లేకుండా.. అవసరం ఉన్నప్పుడు డబ్బును తయారు చేసుకునేలా...అవసరంలేనప్పడు కంప్యూటర్లలో భద్రపరుచుకుంటే ఎలా ఉంటుందో అనే ఊహనుంచి వచ్చిందే బిట్ కాయిన్ . దీన్ని క్రిప్టోకరెన్సీ అని కూడా అంటారు. ఈ బిట్ కాయిన్ రంగంలో కి అడుగుపెట్టేందుకు రిలయన్స్ జియో ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జియో కాయిన్ లైవ్‌మింట్ రిపోర్టు ప్రకారం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ జియో కాయిన్ పేరిట మార్కెట్లోకి తన సొంత క్రిప్టోకరెన్సీని సృష్టించేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నట్లుగా తెలుస్తోంది అధినేతగా ముఖేష్ పెద్ద కొడుకు.. దీనికి అధినేతగా ముఖేష్ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ సారధ్యం వహిస్తున్నట్లుగా ఆ రిపోర్టు తెలిపింది. మొత్తం 50 మంది యువకులతో కూడిన టీమ్ జియో కాయిన్ మీద కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే బిట్ కాయిన్ ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిట్ కాయిన్ చట్టవిరుద్దమైందని..ఇందులో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయోద్దని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇందులో పెట్టుబడులు పెట్టరాదని పెట్టుబడిదారులను హెచ్చరించారు. వీటిల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని దీనికి చట్టబద్దత లేదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు.