క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ చూడని కనీ విని ఎరుగని రికార్డు నమోదయింది.. కేవలం రెండంటే రెండు పరుగులకే అల్ అవుట్ అయిన సందర్భం..బీసీసీఐ ఆధ్వర్యంలో గుంటూరులో జరుగుతున్న అండర్ -19 ఉమెన్స్ సూపర్ లీగ్ లో ఈ సరికొత్త రికార్డుకు వేదికైంది. వివరాల్లోకి వెళ్తే నాగాలాండ్-కేరళ మధ్య జరుగుతున్న 50 ఓవర్ల మ్యాచ్ లో. నాగాలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఓపెనర్లు 5.2 ఓవర్లలో ఒక్క రన్ మాత్రమే చేశారు.
తర్వాత వచ్చిన బ్యాట్స్ ఉమెన్ 17 ఓవర్ల దాకా క్రీజ్ లో ఉన్నప్పటికీ ఒక్క పరుగు కూడా చేయకుండానే మొత్తం ఆలౌట్ అయిపోయారు. మరో పరుగు వైడ్ రూపంలో రావడంతో కేరళకు మూడు పరుగుల టార్గెట్ ఇచ్చి నాగాలాండ్ క్రీడాకారిణిలు చేతులెత్తేశారు. ఇక మూడు పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేరళా జట్టు. నాగాలాండ్ వేసిన తొలిబంతినే ఫోర్ గా మలిచింది.. దీంతో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా నాగాలాండ్ జట్టుపై కేరళ జట్టు విజానందుకుంది..