టీమిండియా సూపర్ ఆల్ రౌండర్ కమ్ బిగ్ హిట్టర్ రవీంద్ర జడేజా సౌరాష్ట్ర అంతర్ జిల్లా టీ-20 టోర్నీలో చెలరేగిపోయాడు. జామ్ నగర్ జిల్లా జట్టులో సభ్యుడిగా అమ్రేలీజట్టుతో ముగిసిన పోటీ ఓ ఓవర్లో ఆరు కు ఆరు బాల్స్ లోనూ సిక్సర్లు బాది గతంలో ఇదే ఘనత సాధించిన రవి శాస్త్రి, యువరాజ్ సింగ్ ల సరసన చోటు సంపాదించాడు. ఆట 10వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన జడేజా నీలం వంజా అనే బౌలర్ ఓవర్లోనే ఆరు భారీసిక్సర్లతో 36 పరుగులు సాధించాడు.
కేవలం 69 బాల్స్ లోనే 154 పరుగులతో తనజట్టుకు 239 పరుగుల భారీస్కోరు అందించాడు. గతంలో ఓ రంజీమ్యాచ్ లో రవిశాస్త్రి ఓ ఓవర్ ఆరు బంతుల్లోనూ సిక్సర్లు బాదితే సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఓ ఓవర్ ఆరు బాల్స్ లోనూ సిక్సర్లు కొట్టి వారేవ్వే అనిపించుకొన్నాడు. ఇప్పుడు రవీంద్ర జడేజా ఆరు కు ఆరు సిక్సర్ల రికార్డుతో ఈ ఘనత సాధించిన భారత మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు.