ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య.. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఆమెపై రాజద్రోహం కింద పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రమ్య చేసిన ఓ ట్వీట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మోదీ తనను పోలిన మరో రూపంపై చోర్ అని రాసుకుంటున్నట్టు ఉన్న ఓ మార్ఫింగ్ ఫొటోను ట్విట్టర్ షేర్ చేశారు. అయితే ఆ ఫోటో దేశ ఖ్యాతిని దిగజార్చేలా ఉందని.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడి నేతను ఆ ఫొటోతో అంతర్జాతీయంగా చులకన భావం ఏర్పడే ప్రమాదముందని ప్రముఖ న్యాయవాది రిజ్వాన్ అహ్మద్ గోమతినగర్ పోలీసులను ఆశ్రయించారు. దాంతో నటి రమ్యపై పోలీసులు రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఇక ఆమెపై కేసు పోలీసులు కేసు నమోధు చేస్తే పార్టీలోని ఒక్కరు కూడా స్పందించలేదని ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు రమ్య పార్టీ పదవికి మాత్రమే రాజీనామా చేశారని పార్టీకి కాదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.