గుజరాత్‌లోని నర్మదా నదిపై 182 మీటర్ల ఎత్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే, ఇదే తరహాలో అయోధ్యలో రాముడి భారీ విగ్రహాన్ని ఏర్పాటుకు భారీ సన్నాహాలు చేస్తున్నారు.. సరయూ నది తీరంలో సుమారు 151 మీటర్ల ఎత్తున్న రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనికి సంబంధించిన వివరాలు దీపావళి రోజున ప్రకటన వెల్లడించనున్నారు.. భూపరీక్ష నిర్వహించకే విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామని అధికారులు స్పష్టంచేశారు.. సంత్ తులసీదాస్ ఘాట్ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు సమాచారం.