రాఖీతో దేవతలందరి రక్షణ

Update: 2018-08-26 04:13 GMT

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ.. సోదరికి కొండంత అండగా నిలిచి, ఆకాశమంత ప్రేమను పంచే పండుగ రోజు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ రాఖీ.. శ్రావణ పౌర్ణమి రోజు వచ్చింది.. సోదరులకు రాఖి కట్టేందుకు ఆడపడుచులంతా సిద్ధమయ్యారు.  సోదరిని తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడుచును దేవతా స్వరూపంగా భావిస్తారు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మిగా పిలుచుకుంటాం.. ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టినట్లుగా భావించే సంప్రదాయం భారతీయులది. అందుకే, శ్రావణ పౌర్ణమి నాడు సోదరి చేత రాఖి కట్టించుకుంటారు సోదరులు. ఈ రాఖీతో దేవతలందరి రక్షణ కలుగుతుందని ప్రాచీన కాలం నుంచి ఉన్న విశ్వాసం. ఇతిహాసాల ప్రకారం.. ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల్ల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంది. అది చూసిన ద్రౌపది తన చీరకొంగు చింపి వేలికి కట్టు కడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా నీకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. ఈ  ఇతిహాసాన్ని కూడా రాఖి పండగకు ఉదాహరణ పెద్దలు చెబుతారు. 

Similar News