అతిలోకసుందరి శ్రీదేవి హఠాన్మరణం అందర్ని కలచివేసింది. దేశవ్యాప్తంగా అభిమానులు తట్టుకోలేకపోయారు. కష్టానికి లెక్కచేయక ముంబైలోని శ్రీదేవి ఇంటి ముందు గంటల తరబడి పడిగాపులుకాసి కడసారి శ్రీదేవిని చూసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొంత మంది అయితే కన్నీరు కూడా కార్చారు. గుండెల నిండ బాధతో ఎవరి ఇళ్లు వాళ్లు చేరుకొని యధావిధిగా తమ పనుల్లో మునిగిపోయారు.
ఇక ఈ తరుణంలో వివాదాస్పద నటి రాఖీసావంత్ తన 'ఇన్స్‌స్టాగ్రాం'లో పోస్టు చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియో అందర్ని కడుపుబ్బా నవ్విస్తోంది. ‘‘శ్రీదేవీగారు.. మీరంటే నాకు చాలా ఇష్టం. ఏమైంది మీకు? ఇంత త్వరగా ఎందుకు చనిపోయారు. ఇక ఇప్పుడు మీలా ఎవరు నటించాలి, ఎవరు డాన్స్ చేయాలి. మీరు లేని ఈ లోకంలో నాకు బతకాలని లేదంటూ’’ వీడియో ఆధ్యంతం రాఖీ కన్నీళ్లు పెట్టుకుంటూ తన వీడియో తానే షూట్ చేసుకొని పోస్టు చేసింది.
ఇక ఆ తర్వాత ఈ వీడియోపై నెటిజన్లు సెటైర్ల వర్షం ప్రారంభమైంది. ఏమాత్రం అవకాశాలు లేక గోళ్లు గిల్లుకుంటున్న రాఖీ సావంత్ ఓవరాక్షన్ అంతా అచ్చంగా పబ్లిసీటీ కోసమే అంటూ నెటిజన్లు తేల్చిపారేశారు. అంతటితో ఆగకుండా రాఖీ సావంత్ ఇకనైనా తన ఓవరాక్షన్ మానుకోవాలంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది సంతాప వీడియో కాదు. కామెడీ వీడియో అంటూ ఎద్దేవా చేస్తున్నారు