భార్యను దారుణంగా హత్య చేసి కూర చేశాడో కసాయి భర్త చంపడమే కాదు అనుమానం వస్తుందని శవాన్ని ముక్కలుగా నరికి ప్రెషర్ కుక్కర్‌లో కూర వండాడు . మెక్సికోలోని టాక్సో ప్రాంతానికి చెందిన మెగ్డలీనా, సెసర్ లోపేజ్ లు భార్య భర్తలు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. చూడముచ్చటైన జంట, ఇద్దరు పిల్లలో సంసార జీవితం హాయిగా సాగుతుంది. కానీ అనుకోకుండా వారి జీవితాల్లోకి మనస్పర్ధలు తొంగి చూశాయి. అంతే నువ్వు తప్పు చేశావంటే నువ్వు తప్పు చేశావంటూ విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది. తాము కలిసి ఉండేందుకు ఇష్టపడడం లేదని , విడాకులు కావాలని కోరారు ఆ ఇద్దరు . విడాకులు ఇస్తే పిల్లల భవిష్యత్తుపై మల్లగుల్లాలు పడిన కోర్టు ఎట్టకేలకు వారికి విడాకులు మంజూరు చేస్తూ పిల్లల్ని కొంతకాలం తల్లి మెగ్డలీనా దగ్గర, మరికొంత కాలం భర్త సెసర్ లోపేజ్ ల దగ్గర ఉండేలా తీర్పించింది. విడాకుల తీసుకున్న అనంతరం కొంత కాలానికి సెసర్ లోపేజ్ రెండో పెళ్లి చేసుకొని పిల్లల్ని తన దగ్గరే ఉంచుకున్నాడు.
కోర్టు తీర్పు ప్రకారం తండ్రి దగ్గరే ఉన్న తన పిల్లల్ని తెచ్చుకునేందుకు మొదటి భార్య సెసర్ లోపేజ్ ఇంటికి వెళ్లింది. అయితే వెళ్లిన కూతురు ఇంకా ఇంటిరాలేదని తల్లిదండ్రుల కంగారు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు మెగ్డలీనా ఎక్కడికి వెళ్లింది...? ఎందుకు వెళ్లింది..? అనే విషయాల్ని ఆరాతీశారు.
అయితే భర్త లోపేజ్ పై అనుమానం రాగా పోలీసులు అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. కానీ అక్కడే ఓ భయంకరమైన దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. సెసర్ ఎక్కడ కనిపించలేదు. ఇల్లంతా రక్తపు మడుగులు. వంటగదిలో ఏదో వండుతున్నారని అనుమానం వచ్చిన పోలీసులకు వెళ్లి చూడగా ప్రెషర్ కుక్కర్ లోకూర ఉడుకుతుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే అది కూర కాదు. మొదటి భార్యను హత్య చేసిన నిందితుడు ఆమె ను ముక్కలుముక్కలు గా నరికి ప్రెషర్ కుక్కలో కూర వండుతున్నాడు. ఆసమయంలో పోలీసులు వస్తున్నారనే విషయం తెలుసుకున్న నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ భయానక దృశ్యాల్ని చూసిన పోలీసులు సెసర్ పై కేసు నమోదు చేసుకొని అతడికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిందితుడు దొరికితే కఠినమైన శిక్షలు విధిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.