సామాజిక కార్యకర్త దేవి, వైజాగ్ చెందిన ఓ మహిళతో అసభ్యం గా మాట్లాడినందుకు డైరక్టర్ ఆర్జీవీ పై సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దాదాపు 3గంటల పాటు జరిగిన విచారణలో కొన్ని పొంతనలేని సమాధానాలిచ్చిన ఆర్జీవీ..ఇన్వెస్టిగేషన్ తరువాత బయటకు వచ్చాడు. ఆ తరువాత ఆర్జీవీ తన తీరును మార్చుకుంటాడని అందురు అనుకున్నారు. కానీ విచారణ జరిగిన కొన్ని గంటలకే పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ, ఆయన అభిమానులు ఆగ్రహానికి గురిచేసేలా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
విచారణ తరువాత సీసీఎస్ పోలీసుల విచారణ గురించి ఏదైనా మాట్లాడతారేమోనని అందరు ఊహించారు. కానీ వారి ఊహలకు అందకుండా ఆర్జీవీ తనదైన స్టైల్లో పవన్ గురించి ట్వీట్ చేశారు. నాకు పవన్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసా..? అని ట్విట్ చేశారు. అంతేకాదు జీఎస్టీకి కొత్త అర్ధం వచ్చేలా పవన్ పోర్న్ కల్యాణ్ అని బిరుదిచ్చాడు.
తనకు పోర్న్ అంటే ఎంత ఇష్టమో.. పవన్ అంటే అంతే ఇష్టమని పోస్టు పెట్టిన వర్మ. పోర్న్ కు...పవన్ కు బీభత్సమైన పాపులారిటీ ఉందని అన్నారు. అంతటితో ఆగకుండా చివర్లో మీకు ఇష్టమైంది ఏది? పవనా? పోర్నా? అంటూ ఒక పోల్ పెట్టేశాడు. ఈ పోల్ పై 18 వేల మంది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విచారణ గురించి డైవర్ట్ చేసేలా పవన్ పేరిట పోస్టులతో వర్మ తెలివిగా వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.