తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ముందస్తున్న ఎన్నికలొస్తాయంటూ కేంద్రం హింట్ ఇవ్వడంతో గెలుపు గుర్రాల కోసం ఈక్వేషన్స్ మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి ఎంతమంది నేతలు మారతారనేది నేతలు బహిరంగంగానే స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు.
దీని ఆధారంగా ఎంపీ కల్వకుంట్ల కవితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని విషయాన్ని కొన్ని సర్వేలు తేల్చి చెప్పాయని సూచించారు. తాము చేస్తున్న అభివృద్దే ఇందుకు నిదర్శనమంటూ ధీమా వ్యక్తం చేశారు.
ఇక తెలంగాణ జేఏసీ ఛైర్మన్ తాను పార్టీ పెడితే టీఆర్ఎస్ పార్టీ నుంచి 15మంది ఎమ్మెల్యేలు తన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలు ఎలా ఉన్నా ఇప్పట్లో పార్టీ పెట్టే దాఖలాలు లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై పొగడ్తల వర్షం కురిపించిన జనసేన అధినేత తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని స్థాపించి మూడున్నరేళ్లు గడిచినా ఇంకా పార్టీ నిర్మాణం జరగలేదనే విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ మూడున్నర ఏళ్ల పసి ప్రాయంలో ఉన్నా 70ఏళ్ల ప్రజా సమస్యలపై పోటీ చేస్తుందని అన్నారు. పొత్తు విషయం లో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న జనసేన వచ్చే ఎన్నికల నాటికి దాదాపు ఓ 25 కీలక నేతల్ని ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పర్యటనల చేసిన పవన్ ఆ కీలక నేతల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. వారిలో రాజకీయంగా తలపండిన మేధావులు, విద్యా వేత్తలు ఉన్నారని పొలికల్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. సందర్భాన్ని బట్టి వీరిని జనసేనలోకి ఆహ్వానించి కీలక పదవుల్ని కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారట.