హైదరాబాద్‌లో రెండ్రోజులు జరిగిన జేఎఫ్‌సీ సమావేశం ముగిసింది. ఏపీ విభజన హామీల అమలు, కేంద్రం విడుదల చేసిన నిధులు, ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చు. విభజన హామీల సాధన గురించి ఈ సమావేశంలో చర్చించారు. నిధులు, ప్రత్యేక హోదా ఇస్తామని మభ్యపెట్టారని పవన్ కల్యాణ్ అన్నారు. ఎంపీలు సరిగా పనిచేయకపోవడంతోనే.. హోదా రాలేదన్నారు. ప్రత్యేక హోదా ఎవరి వ్యక్తిగత సమస్య కాదన్నారు. ఎంపీలు ఎందుకు భయపడ్డారో తెలియడం లేదన్నారు పవన్ కల్యాణ్.