కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఉండిందన్న చందాన తయారైంది. నెల్లూరు బోధనాసుపత్రిలో ఓ రోగి పరిస్థితి. కడపు నొప్పితో వెళ్లిన వ్యక్తికి వైద్యులు చేసిన నిర్లక్ష్యం చివరికి ప్రాణాల మీదకే తెచ్చింది. ఇప్పుడు అతని ఆరోగ్యం అంపశయ్యమీదకెక్కింది. మొత్తంగా ప్రభుత్వ దవాఖానా వైద్యులు చేసిన నిర్లక్ష్యం ఆ కుటుంబాన్ని అన్ని విధాలా అష్టకష్టాల పాలు చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే చలపతిరావు అనే వ్యక్తి నెల క్రితం క్రితం కడుపు నొప్పితో నెల్లూరు బోధనాసుపత్రిలో చేరాడు.. హడావుడిగా పరీక్షలు నిర్వహించిన ఇక్కడి అపర ధన్వంతరులు రోగ నిర్దారణ కాకముందే అపంటీస్ సైటీస్ గా భావించి శస్త్రచికిత్స చేశారు. ఆపై సర్జికల్ సిజర్ కడుపులో పెట్టి కుట్లేసేశారు. ఆలస్యంగా తెలుసుకుని మరోసారి శస్తచికిత్స చేసి సర్జకల్ సిజర్ బయటికి తీసినా రోగిని మరో రోగం వెంటాడింది.
అయితే వాస్తవంగా చలపతికి అపెండీసైటీస్ కాదని ఇటీవల మరోసారి పరీక్షించిన వైద్యులు నిగ్గు తేల్చారు. అతని టీబీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ బోధానాసుపత్రికి వెళ్లగా డాక్టర్లు చేసిన పొరపాటు ఆ కుటుంబాన్ని నానా అవస్థలకు గురిచేసింది. పదిరోజుల అనంతరం మళ్లీ పరీక్షిస్తే క్యాన్సర్ లక్షణాలు బయటపడ్డాయి.
దీంతో కంగారు పడ్డ నెల్లూరు ప్రభుత్వ వైద్యులు హడావుడిగా రోగిని భావించి తిరుపతి రుయా హాస్పటల్‌కు తరలించి చేతులు దులుపుకున్నారు. కాగా చలపతి రావు పరిస్థితికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.