మెగా కంపౌండ్ నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. . తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు నాగబాబుకు ఉన్న అప్పును తీర్చినట్లు తెలుస్తోంది. గతంలో నాగబాబు నిర్మాతగా రాంచరణ్ - జెనీలియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఆరెంజ్. ఈ చిత్రం చక్కటి రొమాంటిక్ లవ్ అండ్ ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కింది. అయితే బాక్సాఫిస్ వద్ద అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది.
ఆరెంజ్ తెరకెక్కించిన బొమ్మరిల్లు బాస్కర్ డైరక్షన్ , సినిమా నిర్మాణ విలువలు బాగున్నా కథ తేలిపోవడంతో డిజాస్టర్ గా మిగిలిపోయింది. అంతేకాదు సినిమా నిర్మాణ సమయంలో డైరక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ సినిమాను రీషూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు సినిమా చూసి నచ్చక మూడు సార్లు రీషూట్ చేయించారని, దీనిపై నిర్మాత నాగబాబు డైరక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో విభేదాలు తలెత్తాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే ఆ సినిమా మిగిల్చిన నష్టాల నుంచి బయటపడేందుకు నాగబాబు చాలా కష్టపడ్డాడు. ఒకానొక సమయంలోతాను ఆత్మహత్యకోసం ప్రయత్నించే ఆలోచనలు కూడా వచ్చినట్లు చెప్పారు. కానీ తన తమ్ముడు పవన్ కల్యాణ్ పెద్దమొత్తంలో ఉన్న అప్పును తీర్చేసి ఆదుకున్నాడు. పవన్ ఇచ్చిన మొత్తాన్ని నాగబాబు తిరిగి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో నాగబాబు ఓ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ లో భాగస్వామిగా ఉన్నారని, ఇప్పుడు ఆ షేర్లు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అంతే అలా వచ్చిన పెద్దమొత్తాన్ని తమ్ముడు పవన్ కల్యాణ్ కు ఇచ్చి అప్పుతీర్చుకున్నట్లు వార్తలు ఫిల్మింనగర్ వర్గాల్లో చక్కెర్లు కొడుతున్నాయి.