చంద్రబాబు పాలన రావణాసుడు, నరకాసురుడు కలిసి పాలించినట్టుగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనంతపురం జిల్లా ధనియాని చెరువు వద్ద జగన్ పాదయాత్రలో పాల్గొన్న రోజా చంద్రబాబు పాలన అంతానికి మహిళలంతా పిడికి బిగించి శపథం చేయాలని కోరారు.
నరకాసురుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు సైకిల్ అంటూ ఎన్నో హామీలు ఇచ్చారని అన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పారు. 'పిడికిలి బిగించి మహిళలంతా ఒక శపథం చేయాలి మహిళల పంతం.. చంద్రబాబు పాలన అంతం అంటూ పోరాడాలి' అని రోజా పిలుపునిచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న పాదయాత్ర కొనసాగుతోంది. నిన్న అనంతపురం జిల్లా ధనియాని చెరువు వద్ద జగన్ మహిళల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు సైకిల్ అంటూ ఎన్నో హామీలు ఇచ్చారని అన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పారు. 'పిడికిలి బిగించి మహిళలంతా ఒక శపథం చేయాలి.. మహిళల పంతం.. చంద్రబాబు పాలన అంతం అంటూ పోరాడాలి' అని రోజా పిలుపునిచ్చారు.
చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోందని రోజా అన్నారు. మద్యం కారణంగా ఆడవారిపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. జగనన్న అధికారంలోకి రాగానే దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తారని తెలిపారు. చంద్రబాబు నివాసం ఉంటోన్న విజయవాడలోనే మహిళలపై అరాచకాలు ఎక్కువవుతున్నాయని అన్నారు. అక్కడే అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవడం లేదని తెలిపారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదని అన్నారు. రాబోయే కాలంలో జరగబోయే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు.