మంత్రి దేవినేని ఉమకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని ఎడ్ల బండిమీదనుంచి కాలు జారి పడ్డారు. గొల్లపూడిలో ఏరువాక కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డప్పు శబ్దాలు, మైక్ సౌండ్స్ విని ఎడ్లు బెదిరి పరుగులు తీసే ప్రయత్నం చేశాయి.