అందరి లెక్కలూ తన దగ్గర ఉన్నాయని సమయం వచ్చినప్పుడు ఆ లెక్కలకు సరైన సమాధానం అప్పజెప్తానని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కొత్తపల్లెలో పర్యటించిన ఆమె గత అనుభవాలను గుర్తుచేస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. కొత్తపల్లె అభివృద్ధిని అడ్డుకుంటే తాట తీస్తానన్న అఖిలప్రియ తమ జెండా ఎగురవేస్తామని తేల్చిచెప్పారు.