అమీర్‌పేట స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో ట్రయల్ రన్ ప్రారంభమైంది, ట్రయల్ రన్ లో భాగంగా మెట్రోలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ప్రయాణించారు. మెట్రో ఫేజ్-2 పనులను పరిశీలించారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు మెట్రోను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. తొలి దశ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందన్నారు. జులై చివరి నాటికి మెట్రో రెండో దశ పూర్తవుతుందన్నారు. నగరంలో మెట్రోను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టంకు త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతామని చెప్పారు. 500ల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయబోతున్నామని తెలిపారు. మియాపూర్ స్టేషన్‌లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.