ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షాపులను మూసివేస్తున్నట్లు డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. దాంతో హాస్పిటల్ వుండే మందుల షాపులు, అత్యవసర మందులు మినహా దాదాపు అన్నిచోట్లా మెడికల్ షాపులు మూతబడ్డాయి. ఇటీవల ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు చేసుకోవచ్చని డ్రగ్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్‌లో చేర్చడం మెడికల్ షాపులకు ఇబ్బందికరంగా మారింది. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకం వల్ల నాసిరక మందులు మార్కెట్లోకి వచ్చే ప్రమాదం ఉందని.. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా మందుల వాడకం చేయకూడదంటున్నారు. దాంతో ప్రజలకు, ప్రభుత్వానికి కలిగే ఇబ్బందులను తెలియజేసేందుకు బంద్ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ స్పష్టం చేసింది.