తెలుగులో సరైన హిట్టు లేక తమిళంలో సినిమాలు చేసుకుంటున్న హీరో సందీప్ కిషన్ మంజుల దర్శకత్వంలో "మనసుకు నచ్చింది తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా అని తెలుసుకోవాలంటే రివ్యూ చదవాల్సిందే.
కథ
సురజ్ (సందీప్ కిషన్) నిత్య (అమైరా దస్తూర్) లు చిన్ననాటి స్నేహితులు. కానీ ఇరు కుటుంబాల పెద్దలు అది ప్రేమ అనుకొని చిన్నప్పుడే వీళ్లిద్దరు మొగుడు - పెళ్లాలని ఫిక్స్ అవుతారు. అయితే అది స్నేహం అని నమ్మే సురజ్ పెళ్లి సమయానికి తన స్నేహితురాలు నిత్యతో కలిసి పారిపోయి గోవా లో ఒక గెస్ట్ హౌస్ లో ఉంటారు. అనుకోకుండా వీళ్ల జీవితాల్లోకి నిఖిత (త్రిద చౌదరి) ఇంకా అభయ్ (అదిత్ అరుణ్) ఎంటర్ అవుతారు. సురజ్ - నిఖిత ని ఇష్టపడితే అభయ్ - నిత్య ని ఇష్టపడతాడు.
అలా నలుగురి మధ్య ప్రేమాయణం కొనసాగుతుండగా కన్ ప్యూజన్ లో ఉన్న సురజ్ కు మనది స్నేహం కాదు ప్రేమ అని గుర్తు చేస్తుంది నిత్య. కాని అప్పటికే సురజ్ - నికిత ప్రేమలో పడిపోతాడు. అసలు సురజ్ కి తన ప్రేమని ఎలా ఎక్స్ ప్రెస్ చేసింది? వాళ్ళిద్దరూ చివరగా ఎలా ఒకటయ్యారు? సురజ్ తను ప్రేమిస్తున్న ఫోటోగ్రఫీ కెరీర్ లో ఎలా సక్సెస్ అయ్యాడు? అసలు ప్రకృతికి వీళ్ళ ప్రేమ కి ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.
నటీ - నటులు
మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ తన క్యారక్టర్ కు న్యాయం చేయలేకపోయాడు. కామెడీ సీన్స్ బాగున్నా, ఎమోషనల్ సీన్లు పేలవంగా ఉన్నాయి. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్ననే మూడ్ లోనే మూవీలో యాక్ట్ చేసినట్లు తెరపై చూస్తే అర్ధం అవుతుంది.
మెయిన్ లీడ్ గా నటించిన అమైరా దస్తూర్ పర్వాలేదు అనిపించింది. యాక్ట్ చేసే స్కోప్ ఉన్నా .. యోగ సీన్స్ పెట్టి తన క్యారెక్టర్ కి ఎక్కువ న్యాయం చేయలేకపోయారు మేకర్స్. సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిద చౌదరి కేవలం గ్లామర్ షో కె తప్ప మూవీ కి నటన పరంగా అస్సలు హెల్ప్ అవ్వలేదు. అలాగే మూవీ లో ఒక చిన్న పాత్రలో నటించిన అదిత్ అరుణ్ తన పరిధి మేరకు బాగానే నటించాడు. ముఖ్య పాత్రలో నటించిన నాజర్ తన మార్క్ చూపించలేకపోయారు.
మంజుల కూతురు అయిన జాహ్నవి ఉన్నంత సేపు సరదాగా ఉంటుంది. మొదటి సినిమా తోనే తనదైన నటన తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది . ప్రియ దర్శి ఫ్రెండ్స్ క్యారక్టర్లు ఒప్పుకోకపోతే బాగుంటుంది. హీరోయిన్ గా ఫ్రెండ్ గా నటించిన పునర్వి భూపాలం కొన్ని సీన్స్ లో హీరోయిన్ ని డామినేట్ చేయాలి అని చూసి నటనని పక్కనపెట్టినట్టు అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం
సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రాఫిక్స్ సీన్లు కొన్ని చోట్ల ప్రేక్షకుల్ని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశాయి. రధాన్ అందించిన ఒక్క పాట తప్ప మిగత మ్యూజిక్ బాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయం లో కూడా కేర్ తిసుకోలేకపోయాడు రధాన్. ఈ మూవీ కి మాటలని అందించిన సాయి మాధవ్ బుర్రా మాటలు అక్కడక్కడా బాగున్నాయి అంతే. డైరక్టర్ మంజుల ఘట్టమనేని ఎంచుకున్న కథ పాతదే అయినా కొత్తగా రాయలేకపోయారు.
సీన్స్ ని కూడా సరిగ్గా కంపోస్ చేయలేక చతికిలబడిపోయింది . మూవీ లో యోగ , ప్రకృతి మీద తీసుకున్న శ్రద్ధ కొంచెం కథనం విషయంలో కూడా తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇదిలా ఉంటే మూవీ లో ప్రకృతికి సూపర్ స్టార్ మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ ని అందించి కథని స్టార్ట్ చేసాడు.
ప్లస్ పాయింట్స్
సినిమాటోగ్రఫీ
మాటలు
మైనస్ పాయింట్స్
కథ
కథనం
మూవీ లెంగ్త్
మెయిన్ లీడ్ యాక్టింగ్