జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఇదేనట..

Update: 2018-11-26 02:29 GMT

ఇప్పుడున్న కాలంలో ఆడ, మగ అన్న బేధం లేకుండా కొందరికి అధిక సంఖ్యలో జుట్టు రాలుతుంది. సాధారణంగా రోజుకు 50 నుంచి 70 వెంట్రులకు రాలిపోతుంటాయి. ఇది ఆరోగ్యవంతుని లక్షణం కూడా. అలా రాలిపోయిన వెంట్రుకల్లో 90శాతం తిరిగి వస్తాయి. అయితే కొందరికి వెంట్రుక ఊడింది అంటే తిరిగి రాదు. అది జన్యుపరమైన లోపమో, ఆహారపు అలవాట్ల వలనో జరుగుతుంది. ముఖ్యంగా వెంట్రుక రాలిపోవడానికి కారణాల్లో 'ఐరన్' అతిముఖ్యమైనదని తేల్చారు అమెరికన్ శాస్త్రవేత్తలు. అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ డెర్మటాలజీకి చెందిన లియోనిడ్‌ బెంజమిన్‌ ట్రోస్ట్‌ అనే శాస్త్రవేత్త 40 సంవత్సరాల నుంచి వెంట్రుకలు రాలడంపై పరిశోధనలు చేస్తున్నారు. ఫైనల్ గా జుట్టు రాలడానికి కారణాల్లో 'ఐరన్' లోపమేనని అయన కనుగొన్నారు. 'శరీరంలో ఐరన్‌ లోపాన్ని అధిగమించిన తర్వాతే జుట్టు రాలే సమస్యకు చికిత్స ప్రారంభించాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు సాధించగలం'  మాంసాహారం తినకపోవడం వల్ల తగినంత ఐరన్‌ శరీరానికి అందడం లేదని అయన పరిశోధనలో తేలింది. శాకాహారంలో కూడా ఐరన్‌ ఉన్నప్పటికీ శరీరానికి కావలసిన స్థాయిలో లేదని అయన గుర్తించారు. కాగా మహిళలకు రోజుకు 18 మిల్లీగ్రాములు, పురుషులకు 8 మిల్లీగ్రాముల ఐరన్‌ అవసరం. ఈ శాతం కంటే తక్కువ తీసుకుంటే జుట్టు రాలడంతో పాటు వేరే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆయన అన్నారు. 

Similar News