25వ సినిమా పేరుతో భారం మొత్తాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ పైనే వదిలి.. చివరికి అజ్ఞాతవాసి లాంటి అట్టర్ ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆ తప్పు నుంచి పాఠం నేర్చుకున్న ప్రిన్స్ మహేష్ బాబు.. తన 25వ సినిమాను మాత్రం పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఊపిరి లాంటి ప్రయోగాత్మక సినిమాతో సక్సెస్ అందుకున్న హిట్ సినిమాల దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాకు డైరెక్టర్.
మూవీకి యూనిట్ ను ఎంపిక చేయడంలో కూడా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో… ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన డాన్, రాయిష్, తలాష్ లాంటి సినిమాలకు కెమెరా అందించిన మెహనన్ ను.. ఇప్పుడు మహేష్ సినిమాకు తీసుకున్నారట. అదీ కాక.. అమెరికా బ్యాక్ డ్రాప్ లో సినిమాను తీస్తున్నారట. మెహనన్ తో పాటు.. ఇతర సాంకేతిక వర్గం, నటీ నటులను కూడా భారీ స్థాయిలోనే పేరున్న వాళ్లను తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
డైరెక్ట్ గా చెప్పకపోయినా సరే. ఇదంతా.. అజ్ఞాతవాసి రిజల్ట్ ను మనసులో పెట్టుకుని.. అది రిపీట్ కాకుండా మహేష్ జాగ్రత్త తీసుకుంటున్నట్టుగా అనిపించడం లేదూ!