గతకొన్ని రోజులుగా పలు రాష్ట్రాల పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న మాఫియా డాన్ సంపత్ నెహ్రా ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మియాపూర్ లో తలదాచుకుంటున్న సంపత్ ను పోలీసులు పక్కా సమాచారంతో వెళ్లి పట్టుకున్నారు. సంపత్ హర్యానాలో మాఫియా డాన్‌గా ఎదిగాడు. లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడ్డాడు. అయితే ఎప్పుడు ఎవరికీ కనిపించకుండా తన సామ్రాజ్యాన్ని పక్క రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు విస్తరించి అసాంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో హర్యానాలో పలు హత్యలకు పాల్పడి హైదరాబాద్ లో తలదాచుకుంటున్నాడు. ఇప్పటికే ఈ మాఫియా డాన్ గురించి పోలీసులు ఆరునెలలుగా వేట ప్రారంభించారు. గురువారం సైబరాబాద్ ఎస్‌ఓటీ, హరియాణా స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉమ్మడిగా రహస్య దాడులు జరిపి చేజిక్కించుకున్నారు.