మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనపై పడ్డ మరకను తుడిపేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తన మాటలతో మనసును హత్తుకునే మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ తో పక్క సినిమాలు, నవలల్ని కాపి చేసి సినిమాలు తీస్తాడనే అపవాదు ఉంది. అయినా త్రివిక్రమ్ మాత్రం ఖండించే ప్రయత్నం చేయలేదు. నాటి అ..ఆ నుంచి నేటి అజ్ఞాతవాసి కాపీ కొట్టిన స్టోరీనేని అర్ధం చేసుకోవచ్చు. ఏం కాపీ కొట్టిన , ఎవరు ఏం అనుకున్నా పట్టించుకోని మాటలమాంత్రికుడిపై అజ్ఞాతవాసి ఎఫెక్ట్ తో కాపీ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఫిల్మినగర్ వర్గాల టాక్.
పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఫస్ట్ లుక్ విడుదల నుండి అనేక వివాదాలు చుట్టుముట్టాయి. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న నిర్మాణ సంస్థ టీ సరిగ్గా విడుదలయ్యే సమయానికి తన సినిమాను కాపీ కొట్టారంటూ అజ్ఞాతవాసి చిత్రయూనిట్ కు నోటీసులు పంపించింది. దీంతో సినిమా విడుదలవుతుందా..?లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. అనేక అనుమానాల నడుమ వ్యయప్రయాసలు కూర్చి టీసిరిస్ కు పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించి. సినిమాను విడుదల చేసింది.
అలా విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దీంతో ఢీలా పడ్డ డైరక్టర్ త్రివిక్రమ్ తాను తరువాత తీయబోయే ఎన్టీఆర్ సినిమాతోనైనా జాగ్రత్తపడాలని అనుకుంటున్నారట. అందులో భాగంగా యద్దనపూడి సులోచనారాణి , మధు బాబు దగ్గర నుంచి కాపీరైట్స్ కొనుగోలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నవలలతో సినిమాతీసి ఎన్టీఆర్ తో హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారట ఈ మాటల మాంత్రికుడు