ఇవాళ (శనివారం) కోల్ కొత్త నైట్ రైడర్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో నైట్ రైడర్స్ ఆటగాళ్లు శివమెత్తారు.. కసితీరా పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సీజన్ లోనే అత్యధిక స్కోర్ నమోదు చేశారు. కేకేఅర్స్ ఆటగాళ్లు సునీల్ నరైన్ కేవలం 36 బంతుల్లో తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సర్లతో 75 పరుగులు చేశాడు.. అలాగే దినేష్ కార్తీక్ 23 బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. మొత్తం మీద ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది కోల్ కత్తా.. ఇదిలావుంటే పంజాబ్ బౌలర్లు టై నాలుగు వికెట్లు పడగొట్టగా మోహిత్ శర్మ బారిందర్ శ్రాన్ చెరో వికెట్ తీశారు. కాగా పంజాబ్ విజయానికి 246 పరుగులు చేయాల్సి ఉంది.