ఒరు ఆడార్ లవ్ సినిమా పాటకు ఆ రాష్ట్ర సీఎం బాసటగా నిలిచారు. మపిల్ల పట్టు అనే ముస్లిం సంప్రదాయ పాటను మళయాళంలో ‘ఒరు ఆదార్ లవ్’ అనే సినిమాలో ఉపయోగించారు. ఆ సాంగ్ లో ప్రియా ప్రకాశ్ వారియర్ కనుసైగలతో ప్రపంచాన్ని ఆకర్షించింది. అయితే ముస్లిం మనోబావాలు దెబ్బతిన్నాయని , తక్షణమే ఆ వీడియోల్ని డిలీట్ చేయాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ వివాదం పై స్పందించిన కేరళ సీఎం పినరాయి విజయన్ కేరళలో భావన ప్రకటన స్వేచ్ఛపై అసహనాన్ని ఆమెదించబోమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారియర్ యాక్ట్ చేసిన పాటను 1978లో ఆకాశ వాణిలో ప్రసారం చేసారని అన్నారు. మపిల్ల పట్టు అనే ముస్లిం సంప్రదాయ పాట ఆధారంగా పీఎంఏ జబ్బార్ రాసిన గేయాన్ని రఫీఖ్ పాడారని తెలిపారు. ముస్లింల వివాహాల్లో ఈ పాటను దశాబ్దాలుగా పాడుతూనే ఉన్నారని విజయన్ పేర్కొన్నారు. ఛాందసవాదం, మతతత్వంపై పోరాటానికి కళలు, సాహిత్యం ఆయుధాలని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే ఒక్క కన్నుగీటుతో ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసిన వారియర్ శృంగార తార సన్నీ లియోన్ ను వెనక్కి నెట్టేసింది. మపిల్ల పట్టు సాంగ్ లో వారియర్ ఎక్స్ ప్రెషన్స్ , కను సైగులు యువకులు హృదయాల్ని కొల్లగొట్టింది. దీంతో రాత్రికి రాత్రే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య ఆరున్నర లక్షలు పెరిగింది. తాజాగా బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్‌ను మించిపోయింది.
గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్స్ లిస్ట్‌లో సన్నీని వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది ప్రియా ప్రకాశ్. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కాగానే.. అసలు ఎవరీ ప్రియా అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. గూగుల్ అనలిటిక్స్ రిపోర్ట్‌లో సన్నీని ప్రియా మించినట్లు తేలింది. ఈ ఇద్దరి తర్వాతి స్థానాల్లో కత్రినా కైఫ్, అనుష్క శర్మ, దీపికా పదుకోన్ ఉన్నారు. 18 ఏళ్ల ఈ కేరళ కుట్టి నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా పెద్ద స్టార్ అయిపోయింది. అసలు ఈ రెస్పాన్స్ తాను ఊహించలేదని ఆమె అంటున్నది. ఎంతైనా సోషల్ మీడియానా మజాకా.