గవర్నర్ నరసింహన్ బతక నేర్చిన వ్యక్తి అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. నాడు ఇందిరా గాంధీకి సన్నిహితంగా ఉన్న నరసింహన్ నేడు మోడీకి క్లోజ్‌గా ఉన్నాడని తెలిపారు. అమ్మ కడుపు నుంచే జగన్... నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అని పుట్టాడని ఎద్దేవా చేశారు. మెగాస్టార్ బ్రదర్స్ కూడా సీఎం కావాలని కలలుకంటున్నారని తెలిపారు. కర్నాటక ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్సే గెలుస్తుందని జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు.