ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే టీడీపీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి పార్లమెంటు సాక్షిగా తొడ గొట్టారు. వైసీపీ ఎంపీలను సవాల్ చేశారు. పార్లమెంటు ప్రధాన ద్వారం దగ్గర వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న సమయంలో ఈ సరదా సన్నివేశం జరిగింది. ప్రత్యేక హోదా కావాలంటూ వైసీపీ ఎంపీలు నినదిస్తుంటే అక్కడికి వచ్చిన జేసీ వారితో వాదనకు దిగారు. తమతో కలసి ధర్నా చేయమని వైసీపీ ఎంపీలు కోరేసరికి ఆయన సరదాగా రెచ్చిపోయారు. తనదైశ శైలిలో వైసీపీని విమర్శిస్తూ మీసం మెలేసి తొడకొట్టి సవాల్ విసిరారు. పార్లమెంటులో కాదని బయటకు వచ్చి పోరాడాలని జేసీ అన్నారు. చచ్చి గీపెట్టినా ప్రత్యేక హోదా రాదని జేసీ తేల్చి చెప్పారు.