నా జోలికొస్తే తోలు తీస్తా

Update: 2018-07-26 05:03 GMT

జగన్ విమర్శలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేరన్నారు. రాజకీయాలు చేసేందుకు వేల కోట్లు అవసరం లేదని, గూండాలు అక్కర్లేదని విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో మానవత్వం చచ్చిపోందని పవన్ కల్యాణ్ అన్నారు. నేను వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలుపెడితే తట్టుకోలేరు. పారిపోతారు. అలాంటి మాటలతో ప్రజల సమస్యలు పరిష్కారం కావు అని చెప్పారు. ఇసుక మాఫియా, దోపిడీలు చేసే నాయకులకే ఇంత ధైర్యం ఉంటే ప్రజాసంక్షేమం కోసం నిలబడే నాకెంత తెగింపు ఉండాలి. దూరం నుంచి చూస్తే నేను మెతకగానే కనబడతా. నా దగ్గరికి వస్తే తోలు తీస్తా. సమాజంలో మార్పు తీసుకొస్తాననే భయంతోనే తెదేపా, వైకాపా, భాజపా నన్ను తిడుతున్నాయి. సినిమాల్లో డ్యాన్సులు చేసి, డైలాగులు చెప్పానని అనుకుంటున్నారేమో. బయటకు రండి నేనేంటో చూపిస్తా. వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే మీకంటే బలంగా చేయగలను. నా వెనుక వేల కోట్ల ఆస్తులు లేవు. ప్రజాభిమానమే ఉంది. చిన్నప్పుడు బాడీగార్డునవుతానని చెప్పేవాడిని. ఈ రోజు నేను సమాజానికి అంగరక్షకుడిని అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తలు బైక్ సైలెన్సర్ తీసి శబ్దం చేస్తే తప్పంటున్నారని, మరి ఇంట్లో తుపాకీతో కాల్చి బయట తిరుగుతున్నవారిని మాత్రం పట్టించుకోవడంలేదని పవన్ పరోక్షంగా సినీనటుడు బాలకృష్ణ ఇంట్లో కాల్పుల అంశాన్ని ప్రస్తావించారు. తనకు తాను గొప్ప వ్యక్తినని, ప్రతిపక్ష నేత అని వైఎస్ జగన్ అనుకోవడం పొరపాటని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం సరికాదని, జగన్ ఈ తరహాలో వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదని పేర్కొన్నారు. 
 

Similar News