ఐపీఎల్ వేలం కొనసాగుతోంది. జైపూర్ యువ పేసర్ ఉనద్కత్‌పై మళ్లీ కోట్ల వర్షం కురిసింది. గత సీజన్‌లో రూ.11.5కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతమైన ఉనద్కత్ ఈసారి రూ.1.5 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చాడు. లెఫ్టార్మ్ పేసర్ కోసం రాజస్థాన్, ఢిల్లీ పోటీ పడ్డాయి. మధ్యలో రూ.5కోట్ల బిడ్‌తో చెన్నై కూడా పోటీలోకి వచ్చింది. చివరికి రూ.8.4కోట్లకు మళ్లీ రాజస్థాన్ దక్కించుకుంది. ఇప్పటి ఈవేలంలో భారత్ నుంచి అత్యధిక ధర పలికింది ఉనద్కత్ కావడం విశేషం.