బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. ఐపీఎల్ బెట్టింగ్ కేసులో అర్బాజ్ ఖాన్ చిక్కుకున్నాడు. దావూద్ గ్యాంగ్ బుకీలతో అర్బాజ్ ఖాన్‌కు సంబంధాలున్నాయని అనుమానిస్తున్న థానే పోలీసులు...సల్మాన్ తమ్ముడికి సమన్లు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కొద్ది రోజులల కిందట ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు రట్టు చేసిన థానే పోలీసులు.. పలువురు బుకీలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో దావూద్ గ్యాంగ్ కు చెందిన టాప్ బుకీ సోనూ జలాన్ కూడా ఉన్నాడు. సోనూ జలాన్ విచారణలో కీలక విషయాలు వెల్లడైనట్లు సమాచారం.
దావూద్ గ్యాంగ్‌తో తనకు సంబంధాలున్నాయని టాప్ బుకీ సోనూ జలాన్ అంగీకరించాడు. అంతేకాదు..అర్బాజ్ ఖాన్‌తో ఉన్న లింకుల్ని బయటపెట్టాడు. దీంతో అలెర్టయిన థానే పోలీసులు..ఆధారాలను సంపాదించారు. టాప్ బుకీ సోనూ జలాన్‌తో అర్బాజ్ ఖాన్ దిగిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. దీంతో ఐపీఎల్ బెట్టింగ్ బుకీలతో అర్బాజ్ ఖాన్‌కు సంబంధాలున్నయనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ ఐపిఎల్ సెషన్‌లో బయటపడిన బెట్టింగ్ రాకెట్ విలువ వందల కోట్లలో ఉడడం కలకలం రేపుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌ల బెట్టింగ్ విలువ దాదాపు వెయ్యి కోట్లని సమాచారం. కేవలం ఐపిఎల్ మ్యాచ్‌లపై పెట్టిన బెట్టింగ్ విలువ ఐదు వందల కోట్లకు పైనే ఉంటుందని భావిస్తున్నారు. బెట్టింగ్ వ్యవహారంలో మరిన్ని పెద్ద తలకాయలుంటాయని థానే పోలీసులుఅనుమానిస్తున్నారు. అర్బాజ్ ఖాన్‌ను విచారణలో కీలక విషయాలు రాబట్టాలని పట్టుదలగా ఉన్నారు.