యువ క్రికెటర్ సంజు శాంసన్ ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తిరువనంతపురానికి సమీపంలో గల కోవలెమ్‌లోని రిసార్ట్‌లో ప్రేయసి చారులతను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మతాలు వేరు కావడంతో ప్రత్యేక వివాహ చట్టం కింద వీరి వివాహాన్ని నమోదు చేయించారు. వివాహం అనంతరం సంజు మీడియాతో మాట్లాడాడు. ‘చారులత నేను చిన్నప్పుడు ఒకే పాఠశాలలో చదువుకున్నాం. కళాశాల కూడా ఇద్దరిదీ ఒకటే. 30 ఏళ్ల నుంచి మా ఇద్దరి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని మా కుటుంబాల్లో చెప్పినప్పుడు వెంటనే అంగీకరించారు. మా పెళ్లి నిరాడంబరంగా జరగాలన్నది చారులత కోరిక. తన ఇష్ట ప్రకారమే అత్యంత సన్నిహితుల మధ్య మేమిద్దరం వివాహ బంధంతో ఒక్కటయ్యాం’ అని తెలిపాడు.