మూడు వన్డేల సిరీస్ లో భారత్ అద్భుత శుభారంభాన్నిచ్చింది. బౌలింగ్... బ్యాటింగ్ విభాగాల్లో తమదైన శైలిలో ఇంగ్లాండ్ పై విరుచుకుపడిన కోహ్లీ సేన ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. లెగ్ స్పిన్నర్ కుల్దీప్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు (6/25).. రోహిత్ శర్మ అజేయ శతకం (114 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137 నాటౌట్), కోహ్లీ (82 బంతుల్లో 7 ఫోర్లతో 75) భారత్ మంచి విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్ (51 బంతుల్లో 53; 5 ఫోర్లు), బెన్ స్టోక్స్ (103 బంతుల్లో 50; 2 ఫోర్లు) రాణించారు. ఉమేశ్ యాదవ్ 2, చహల్ ఒక వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 40.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి విజయానందుకుంది. ఇక అత్యధికంగా ఆరు వికెట్లు పడగొట్టడంతో కుల్దీప్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.