నేడు భారత్- ఆస్ట్రేలియా మూడో టీ20

Update: 2018-11-25 05:43 GMT

భారత్ ఆస్ట్రేలియాల మధ్య నేడు మూడో టీ 20 జరగనుంది.  సిడ్నీ క్రికెట్‌ మైదానంలో  జరగనున్న ఈ మ్యాచ్‌ లో భారత్ గెలిస్తే సీరిస్ సమం కానుంది. మరో వైపు ఎలాగైనా విజయం సాధించే లక్ష్యంతో ఆస్ట్రేలియా జట్టు వ్యూహాలు సిద్ధం చేస్తోంది.  భారత జట్టులో పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ను ఆడిస్తారని భావిస్తున్నారు. అయితే, పరుగులిస్తున్నా పేస్‌లో వైవిధ్యంతో ఖలీల్‌ మెరుగ్గానే బౌలింగ్‌ చేస్తూ ఉండటంతో  కెప్టెన్ కోహ్లీ ఆలోచిస్తున్నారు. మెల్‌బోర్న్‌లో ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా మెరుగైన ఆటతీరు ప్రదర్శించడంతో ఈ మ్యాచ్‌లోనూ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసీస్  ఓపెనర్లు డీయార్సీ షార్ట్, కెప్టెన్‌ ఫించ్‌ వైఫల్యంతో లిన్, మ్యాక్స్‌వెల్, మెక్‌డెర్మాట్‌లపై బ్యాటింగ్‌ భారం పడుతోంది.  గాయపడిన స్టాన్‌లేక్‌ స్థానంలో మిచెల్‌ స్టార్క్‌ను జట్టుతో చేర్చినా ఆడేది అనుమానంగానే మారింది.  

Similar News