శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమాల్ ఐసీసీ వేటు వేసింది. కెప్టెన్ తోపాటు కోచ్ చందికా హతురుసింఘే, మేనేజర్ అశంకా గురుసిన్హాలపై నాలుగు వన్డేలు, రెండు టెస్టుల నిషేధాన్ని విధిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. వెస్టిండీస్‌తో సెయింట్ లూసియాలో జరిగిన రెండో టెస్టులో ఆట ఆరంభంలో మైదానంలోకి రాకుండా సమయం వృథా చేశారని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవిడ్ రిచర్డ్‌సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆట రెండున్నర గంటలపాటు ఆలస్యమైందని ఐసీసీ పేర్కొంది. అంతేకాకుండా ఇటీవల విండీస్‌తో రెండో టెస్టులో భాగంగా చండిమాల్ మైదానంలో ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చినట్టు తెలిపింది.
ఈ ముగ్గురు 8 సస్పెన్షన్ పాయింట్లు ఎదుర్కొంటున్నారని, ఈ క్రమంలో తీవ్రంగా పరిగణించామని ఐసీసీ ప్రకటించింది. ఈ నిషేధంతో దినేష్ చండిమాల్, కోచ్ చందికా హతురుసింఘే, మేనేజర్ అశంకా గురుసిన్హాలు దక్షిణాఫ్రికాతో జరగనున్న 4 వన్డేలు, 2 టెస్టుల తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.