భార్య కాపురానికి రావటం లేదంటూ సెల్ టవర్ ఎక్కిన భర్త

Update: 2018-02-17 09:12 GMT

భార్య కాపురానికి రావటం లేదంటూ భర్త ...సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన రాధాకృష‌్ణ..కవితను రెండో వివాహం చేసుకున్నారు. భర్తతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మనోవేదన చెందిన భర్త...పెనుబల్లి మండలంలోని సెల్ టవర్ ఎక్కాడు. కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఘటనస్థలి వద్దకు పోలీసులు వచ్చారు. సెల్ టవర్ ఎక్కిన రాధాకృష్ణకు అతడి భార్యతో సెల్ ఫోన్ లో మాట్లాడించి కిందకు దించారు. సుమారు 4 గంటలపాటు సాగిన హై డ్రామాకు పుల్ స్టాప్ పడింది. 
 

Similar News