మనకు శరీరంలో అతిముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు కూడా ఒకటి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో పలు అనారోగ్య సమస్యలు, లక్షణాలను చూపిస్తుంది. ఆ లక్షణాలను సరైన సమయంలో గమనిస్తే కిడ్నీలు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి.. ముఖం, కాళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. కిడ్నీల పనితీరు మందగించడం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఆక్సిజన్ స్థాయులు తగ్గడం వల్ల శ్వాస సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీలు పాడయినప్పుడు అవి ఉండే భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది.
కిడ్నీలు చెడిపోయాయి అనేదానికి సూచన ఇది. ఏ విషయంపైనా ఏకాగ్రత ఉంచలేకపోవడం, తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి సమస్యలు చుట్టుముడతాయి. మూత్రం రంగు మారినా, మూత్రం పోసేటప్పుడు నొప్పి, అసాధారణ మార్పులు కనిపించినా కిడ్నీ సమస్య ఉందని భావించాలి. కిడ్నీలు తీవ్రంగా చెడిపోతే ఆహరం రుచి, ఆకలి తగ్గుతుంది. రక్తంలోని వ్యర్థాల కారణంగా వికారం, వాంతులు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ లక్షణాలు గనక ఉన్నట్టయితే వారు సంబంధిత వైద్యుడిని సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.