పోలింగ్ సందర్బంగా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా అక్రమాలు జరిగాయని.. ఈవీఎంలను కాకుండా వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేటట్లు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని భావిస్తే ఎన్నికల ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసుకోవాలని.. ఓట్లలెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్నికల వివాదాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా వంటేరు ప్రతాప్‌రెడ్డి గజ్వేల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.