టాలీవుడ్ లో తన జోరు తగ్గింది కాబట్టి బాలీవుడ్ లో తన జెండా గట్టిగా పాతాలని డిసైడ్ అయ్యింది కాబోలు రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్లో ఏ సినిమాకు చేయనంత భీభత్సమైన ప్రమోషన్ తన మొదటి హింది సినిమా అయారి కోసం చేస్తోందనటం అతిశయోక్తి కాదు. గత రెండు నెలల నుంచి ఈ మూవీ కోసమే దేశం మొత్తం రౌండ్లు వేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ వీలు దొరికినప్పుడంతా హాట్ హాట్ ఫోటోలతో ఫోజులిస్తూ అక్కడి మీడియాకు లైవ్ అప్ డేట్ గా మారింది. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఓ కాలేజీకి వెళ్ళిన హీరో సిద్దార్థ్ తనతో పాటు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ని తన రెండు చేతులతో ఎత్తుకోవడం అక్కడున్న వారికి తమ మధ్య ఎంత చక్కని కెమిస్ట్రీ ఉందో చూపించడం వీడియో రూపంలో బాగా వైరల్ అవుతోంది. అక్కడికి సిద్దార్థ్ కాస్త ఇబ్బంది పడుతుంటే రకుల్ చనువుగా సహకారం అందించి సిద్ధార్థ్ తనను గట్టిగా ఎత్తుకునేలా కో ఆపరేట్ చేసింది.
ఈ శుక్రవారమే థియేటర్లలోకి వస్తున్న అయారి ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. పద్మావత్ కోసం ఒకసారి ప్యాడ్ మ్యాన్ కోసం మరోసారి త్యాగం చేసిన ఈ మూవీ ఫైనల్ గా 16న ప్రేక్షకులను పలకరించబోతోంది. చాలా విభిన్నమైన సినిమాలు తీస్తాడనే పేరున్న నీరజ్ పాండే దర్శకుడు కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. మనోజ్ బాజ్ పేయ్ సిద్దార్థ్ మల్హోత్రా ఆర్మీ ఆఫీసర్స్ గా నటిస్తున్న ఈ మూవీలో గ్లామర్ పార్ట్ అండ్ లవ్ రకుల్ తీసుకుంది. ఇద్దరి మధ్య మంచి రొమాన్స్ కూడా సినిమాలో ఉందట.
ఇది హిట్ అయితే ఓ నాలుగైదేళ్ళు బాలీవుడ్ లో సెటిల్ అయిపోవచ్చు అనేది రకుల్ ప్లాన్. ఈ మధ్య మాక్సిమ్ పత్రికకు బోల్డ్ స్టిల్స్ ఇచ్చిన రకుల్ మనవాళ్ళను కూడా ఆశ్చర్యపరిచింది. మరి అయారితో తన దశ మారుతుంది అని ఆశలు పెట్టుకున్న రకుల్ కు ఆ మూవీ హిట్ అవ్వడం చాలా అవసరం. జయ జానకి నాయక తర్వాత ఇంకే తెలుగు సినిమా ఒప్పుకోకపోవడానికి కారణం ఇదేనేమో.