ఊపిరి ఆడ‌నివ్వ‌ని రాజోలు పిల్ల

Update: 2018-02-14 00:08 GMT

 తెలుగింటి అమ్మాయి విలువ తమిళ్ లో టాప్ హీరోయిన్ గా మారిన తర్వాత గానీ తెలుగు ప్రేక్షకులకు చేరలేదు. చాలా గ్యాప్ తర్వాత మల్టీ స్టారర్ చిత్రం వచ్చిన సీతమ్మ వాకిట్లో సీత పాత్రలో ఒదిగిపోయిన అంజలిని స్టార్ నటిగా ఒప్పుకుని అక్కున చేర్చుకున్నారు తెలుగు జనాలు. తొలినాళ్లలో గ్లామర్ రోల్స్ తోపాటు పాత్రా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో చేసి ఇప్పుడు కాస్త విరామం తీసుకుంటుంది. హీరోయిన్ గా ఎంత సక్సెస్ అయినప్పటికీ ఆమెకు తీరని కొరికలు చాలానే ఉన్నాయంట. అందులో దెయ్యం, రఫ్ రోల్స్ చేయటంతోపాటు పాడటం కూడా ఉన్నాయి. 
కోనవెంకట్ పుణ్యమాని గీతాంజలి, శంకారభరణం చిత్రాలు మొదటి రెండు కోరికలను తీర్చాయి. ఇక ముచ్చటగా మూడో కొరిక తీర్చుకునేందుకు అంజలి సిద్ధమయిపోయింది. తాజాగా ఆమె లీడ్ రోల్ లో 'చిత్రాంగద' చిత్రంలో తొలిసారిగా ఓ పాట పాడినట్టు సమాచారం. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సేల స్వామినాథన్ తో కలసి అంజలి ఓ డ్యూయెట్ పాడిందట. దీనిని ఇటీవలే రికార్డు చేసినట్టు చెబుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కంప్లీట్ గా అమెరికా బ్యాక్ డ్రాప్ ఉంటుందని తెలుస్తోంది. వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేప‌థ్యంలో  ఈ రాజోలు పిల్ల సినీ జ‌నాల్ని ఊపిరి ఆడ‌నీయ‌కుండా చేస్తుంది.  మొన్న‌టికి మొన్న భ‌విష్య‌త్తు అంతా నాదే. గ్లామ‌ర్ తో మిమ్మ‌ల్ని ఫిదా చేస్తా అని  ఓ స్టేట్మెంట్ ఇచ్చిందో లేదు అప్పుడే నెట్టింట్లో ర‌చ్చ చేయ‌డం మొదలు పెట్టేసింది. 
స్వ‌త‌హాగా తెలుగు ముద్దుగుమ్మైన అంజ‌లీ త‌మిళం లో మంచి పేరు సంపాదించుకుంది. తెలుగు లో అడ‌పా ద‌డ‌పా సినిమా చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటుంది.  అయితే ఇండ‌స్ట్రీలో హీరోయిన్ లు  జీరో సైజ్ లు చేస్తూ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంటే అంజ‌లీ మాత్రం బొద్దుగా ఉండేందుకు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డేది. దీంతో హీరోల తో సినిమా చేస్తున్న‌ప్పుడు అంజ‌లీ నిండైన రూపం ఎలివేట్ చేయ‌డంతో ఆమెకు సినిమా ఆఫ‌ర్లు  త‌గ్గిపోయాయి. దీంతో స‌న్నాజాజిలాగా త‌యారై  ఆఫ‌ర్లు కొట్టేయాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది. అందుకే ఇదిగో ఇలా స్లిమ్ గా త‌యారై బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్ లో ఉన్న ఆమె ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన అభిమానులు అంజ‌లీకి వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌డ‌తాయంటూ కామెంట్ చేస్తున్నారు.


 

Similar News