మొన్నటిదాకా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ భగ్గుమంటోంది. బుధవారం రాత్రికి10 గ్రాముల బంగారం ధర 32వేలకు చేరుకుంది. ఒక్క రోజులోనే 555 రూపాయలు పెరిగి.. 32వేల రూపాయలను చేరింది. బంగారమే కాక వెండి సైతం కిలో 39 వేల రూపాయలకు చేరుకుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఇది బంగారం ధరలపై ప్రభావంతోపాటు అటు ఇటలీ బడ్జెట్ సంక్షోభం, స్టాక్ మార్కెట్ పతనం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ఈనేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి అయిన బంగారం వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం డాలర్ విలువ 73 రూపాయల 34 పైసలకు చేరింది.. ఇదిలావుంటే హైదరాబాద్‌లో మేలిమి బంగారం ధర 32 వేల 85 రూపాయలు, ఢిల్లీలో 32 వేల 566 రూపాయలు, ముంబైలో 32 వేల 491 రూపాయలు, కోల్‌కతాలో 32 వేల 705 రూపాయలకు చేరింది.