గాలి ముద్దుకృష్ణమ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇతనిని పిలిపించమని చెప్పారట!
తానిక ఎక్కువ కాలం బతకలేనని తెలిసిపోయిందో ఏమో, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, తన చివరి క్షణాల్లో ఒకే ఒక్క వ్యక్తి గురించి అడిగాడు. అతను ఎవరో కాదు. గడచిన 20 సంవత్సరాలుగా తన వాహన డ్రైవర్ గా, వ్యక్తిగత సహాయకుడిగా, నమ్మినబంటుగా ఉన్న చంద్ర. అనారోగ్యంతో ఉన్న ముద్దుకృష్ణమను ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లిన చంద్ర హైదరాబాద్‌కు విమానం ఎక్కించి పంపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే చంద్రను పిలిపించమని ముద్దుకృష్ణమ కోరినట్లు తెలిసింది. ఆయన కుటుంబ సభ్యుల సూచన మేరకు మంగళవారం మధ్యాహ్నం విమానంలో చంద్ర హైదరాబాద్‌కు చేరుకున్నారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ముద్దుకృష్ణమను చూసి కుప్పకూలారు. ‘అయ్యా..!లే అయ్యా..! ఎంతమంది జనం వచ్చారో చూడయ్యా.. !’ అంటూ భౌతికకాయం వద్ద చంద్ర రోదించడం కంట తడి పెట్టించింది.