ధర్మశాల వన్డేలో టీమిండియా ఫ్లాప్ షో చూపించింది. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో.. భారత్ 112 రన్స్‌కు ఆలౌటైంది. ధోనీ 65 రన్స్ చేయడంతో.. టీమిండియా స్కోరు వంద దాటింది. ఇక లంక బౌలర్లలో లక్మల్ 4 వికెట్లతో చెలరేగిపోయాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు.. రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. అక్కడి నుంచి వరుసగా షాక్‌లు తగులుతూనే వస్తున్నాయి. బ్యాట్స్‌మెన్లంతా ఇలా వస్తున్నారు.. అలా వెళ్లిపోతున్నారు. టీమిండియా బ్యాట్స్‌మెన్లకు.. క్రీజులో నిలదొక్కుకునే చాన్స్ కూడా ఇవ్వలేదు లంక బౌలర్లు. ఒక్క ధోనీ మినహాయిస్తే.. మిగతా వాళ్లంతా ఫెయిలయ్యారు. ధవన్, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా డకౌట్ అయ్యారు.