ఇప్పటికే వినియోగదారుల సమాచారం చోరీ ఆరోపణలతో సతమతమవుతున్న పేస్ బుక్ ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పేస్ బుక్ నిపుణులతో చర్చలు ప్రారంభించిన పేస్ బుక్ వ్యవస్థాకుడు మార్క్ జుకర్ బెర్గ్ నేతృత్వంలో ఓ చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. పేస్ బుక్ వినియోగదారుల సమాచారాన్ని లీక్ అవ్వకుండా చూసుకునేందుకు ఓ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు మార్క్ జుకర్ బెర్గ్ తెలిపారు. పేస్ బుక్ లో చూసిన వెబ్ సైట్లు, యాప్స్ సమాచారాన్ని అకౌంట్ నుంచి డిలీట్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందన్నారు. బ్రౌజర్ లో కుకీస్ క్లియర్ కూడా చేసుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు జుకర్ బెర్గ్ తెలియజేశారు.