సీఎం చంద్రబాబుకు నోటీసులు.. ఉండవల్లి ఏమన్నారంటే..

Update: 2018-09-16 03:37 GMT

2010 జూలై 16వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన నాటి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు సహా ఇతర టీడీపీ ప్రజాప్రతినిదులను అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. నిషేధం ఉన్నప్పటికీ కూడ  బాబు సహా టీడీపీ ప్రజా ప్రతినిధులు బాబ్లీని సందర్శించారని ఆరోపిస్తూ ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ విషయంపై చంద్రబాబు సరిగా స్పందించలేదన్న కారణంగా ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ నోటీసులు జారీచేసింది. ఈ ప్రక్రియను టీడీపీ ప్రభుత్వం తప్పుబడుతోంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే చంద్రబాబునాయుడును ఇబ్బందిపాలు చెయ్యాలనే చూస్తోందని ఆరోపిస్తోంది. ఇక ఈ విషయమై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ మాట్లాడారు..  కోర్టుకు హాజరుకావలసిందిగా పలుమార్లు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. కానీ అయన హాజరు కాలేదు అందుకే  నాన్ బెయిలబుల్ నోటీసులు వచ్చాయి. ఇందులో అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు ఒకసారి కోర్టుకు హాజరవుతే సరిపోతుంది. అని అయన అన్నారు. 

Similar News