దక్షిణాఫ్రికా క్రికెటర్ జెపి డుమ్నీ సంచలన ప్రకటన చేశాడు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేశాడు. ఇక నుంచి తాను పూర్తిగా వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారించనున్నట్లు డుమ్నీ తెలిపాడు. తన దేశం తరపున 46 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడటం సంతృప్తినిచ్చిందని డుమ్నీ చెప్పాడు. గత 16సంవత్సరాలుగా తన దేశం తరపున ఆడటం గర్వంగా ఉందన్నాడు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌లో ఆడటం వల్ల తానెంతో నేర్చుకున్నానని చెప్పాడు.