ఎప్పుడూ రద్దీగా ఉండే తిరుమల వెంకన్న సన్నిధానంలో భారీ వర్షాల కారణంగా రద్ధీ తగ్గింది. గంటలోపే భక్తులకు శ్రీవారి దర్శనం జరుగుతోంది. మరోవైపు ప్రశాతంగా దర్శనం జరుగుతోందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
లక్షలాది మంది భక్తులతో నిత్యం సందడిగా.. కళకళాడుతూ ఉండే తిరుమల పుణ్యక్షేత్రం భారీ వర్షాల పుణ్యమా అని వెలవెలబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వాగులూ వంకలూ పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో ప్రజలు బయటకు వచ్చే సాహసం చేయట్లేదు.. భారీ వర్షాల ఎఫెక్ట్ తిరుమలను తాకింది. వర్షాల కారణంగా భక్తులు తమ దర్శనాన్ని వాయిదా వేసుకుంటున్నారు.
సాధారణంగా తమిళప్రజలు పెరిటాసి మాసం ఎంతో ప్రవిత్రమైనదిగా భావిస్తారు.. ఇంతటి ప్రత్యేకమైన రోజుల్లో భక్తులు తాకిడి లేకుండా పోయింది.. శ్రీవారి దర్శనం గంట వ్యవధిలో జరిగిపోతోంది. మరోవైపు స్వామి వారిని కన్నులారా దర్శించుకున్నామని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భక్తులతో నిత్యం రద్దీగా ఉండే కంపార్ట్ మెంట్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి.. మామూలు రోజుల్లో ప్రతీనిత్యం 70వేల మంది వరకు శ్రీవారిని దర్శనానికి వచ్చేవారు. ఇప్పుడది ఈ సంఖ్య భారీగా తగ్గింది.. ఇది శ్రీవారి ఆదాయంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మొత్తానికి భారీవర్షాల ప్రభావం తిరుమల కొండను ఖాళీ చేసింది.