దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కళ్లలో పశ్చాత్తాపం.. తప్పు చేశాననే బాధ.. దాన్ని ఎన్నటికీ దిద్దుకోలేననే మానసిక క్షోభ.. అన్నీ కలసి ఆస్ట్రేలియా మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను శాశ్వతంగా క్రికెట్ నుంచి తప్పుకునేలా చేశాయి. అవును. శనివారం మరోమారు మీడియా ముందుకు వచ్చిన వార్నర్ తన తప్పునకు శిక్షగా జీవితంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడబోవడం లేదని వెల్లడించారు.
`నా ప్రవర్తన సరిగా లేదు. నేను తప్పు చేశాను. అందుకు పరిహారంగా ఇకపై ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగాలనుకోవడం లేదు. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియాకు నా రాజీనామా లేఖను అందజేశాను. నా కుటుంబంతో చర్చించి పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకునే దిశగా కూడా ఆలోచిస్తున్నాను. నా ప్రవర్తనను సరి చేసుకునేందుకు నిపుణుల సహాయం తీసుకుంటాన`ని ఏడుస్తూ మీడియా సమావేశంలో వార్నర్ ప్రకటించాడు.