ఊహించని రికార్డు సాధించిన పుజారా!

Update: 2018-01-17 09:32 GMT

టెస్టుల్లో మంచి రికార్డు ఉన్న టీమిండియా బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో నిరాశపరిచాడు. సెంచూరియన్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో పుజారా రనౌటయ్యాడు. ఇలా ఒక టెస్టులో రెండుసార్లు రనౌటైన తొలి ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా పుజారా నిలిచాడు. దీంతో ఊహించని రికార్డు అతని పేరిట నమోదైంది. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా రెండు ఇన్నింగ్స్‌ల్లో రనౌటైన 25వ బ్యాట్స్‌మన్ పుజారా. ఇక 21వ శ‌తాబ్దంలో ఇలా రెండు ఇన్నింగ్స్‌ల్లో ర‌నౌటైన తొలి బ్యాట్స్‌మ‌న్ కూడా పుజారానే కావ‌డం విశేషం. తొలి ఇన్నింగ్స్ తొలి బంతికే అతడు రనౌటైన విషయం తెలిసిందే. ఇక చివరి రోజు ఉదయం అతనిపైనే టీమిండియా నమ్మకం పెట్టుకోగా.. పుజారా మాత్రం లేని మూడో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా మరిన్ని కష్టాల్లో పడింది. ఓటమికి మరింత చేరువైంది.
 

Similar News