ఏపీ రాజధాని అమరావతిలో చేపట్టిన రాజధాని నిర్మాణాల ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. నిన్న(గురువారం) సచివాలయంలో క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఆథారిటీ (సిఆర్‌డిఏ)పై నిర్వహించిన సమీక్షలో నార్మన్ ఫాస్టర్ ప్రతినిధులతో కలిసి రాజధాని నిర్మాణాల తుది ఆకృతులను సీఎం పరిశీలించారు. ముఖ్యంగా కీలకమైన అసెంబ్లీ, సచివాలయ భవనాల ఆకృతులకు తుది మెరుగులు దిద్దారు. ఈ సందర్బంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని నార్మన్ ఫాస్టర్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే రాజధాని నిర్మాణంలో భాగంగా హైకోర్టు, ఉద్యోగుల నివాసాలు, ప్రజాప్రతినిధులు నివాసాల నిర్మాణం జరుగుతోంది.